*తహసిల్దార్ కార్యాలయం ముట్టడి*
కమ్మర్పల్లి10 అక్టోబర్(జనంసాక్షి)కమ్మర్పల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయన్ని రాష్ట్ర విఆర్ఏల జేఏసీ పిలుపుమేరకు సోమవారం రోజున స్థానిక విఆర్ఏలు తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ గత 78 రోజులుగా శాంతి యుతంగా తమ డిమాండ్ల సాధన కొరకు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.అలాగే ఈ నిరవధిక సమ్మె సమయంలో తమ తోటి వీఆర్ఏలు మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.