తహసిల్దార్ కి సమ్మె నోటీసు అందించిన గ్రామ రెవెన్యూ సహాయకులు

మండలం జులై . (జనం సాక్షి)
గంగారం మండలం తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 25 నుండి సమ్మెకు వెళ్తున్నట్టు గ్రామ రెవెన్యూ సహాయకులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గంగారం మండల తహసీల్దార్ కి పలు డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు అందజేయడం జరిగిందని గ్రామ రెవెన్యూ సహాయకులు అన్నారు. ఈరోజు నుండి గ్రామ రెవెన్యూ సహాయకులు ఎవరు కూడా మండల ఆఫీసులలో విధులు నిర్వహించకుండా మా మా గ్రామాలలో జరిగే విపత్కర పరిస్థితులను ఎప్పటికప్పుడు మండలాధికారులకు చేరవేయుటలో ముందుంటామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకులు దుర్గం. ముత్తయ్య, మద్దెల. సమ్మయ్య,దుర్గం. సమ్మయ్య, జనగం. పాపరావు, ఈసం. శ్రీనివాస్ పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు