Wednesday, 4 November 2026

తహసీల్దారు కార్యాలయానికి తాళం

బిజినేపల్లి, అక్టోబరు 10: ప్రభుత్వం వీఆర్ఎల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తహసీల్దారు కార్యాలయానికి  తాళం వేసి వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయానికి సోమవారం రాష్ట్ర వీఆర్ఎల సంఘం పిలుపు మేరకు తాళం వేసి కార్యాలయం ముందు బైరాయించి నిరసన వ్యక్తం చేసినట్లు వీఆర్ఎల సంఘం మం డల అధ్యక్షుడు సలేశ్వరం తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని 78 రోజులుగా నిరవధిక నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవేదనతో తహసీల్దారు కార్యాలయానికి తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిరసన తెలిపిన వారిలో హుస్సేన్, అంజనేయులు, సాయిబాబు, డేగ శేఖర్, నరేష్ లక్ష్మి, శ్రీహరి తదితరులు ఉన్నారు.