*తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన నిరసన తెలిపిన వీఆర్ఏలు.*

నేరేడుచర్ల,అక్టోబర్10,(జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు.గత 78 రోజులుగా వీఆర్ఏలు న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో తహశీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసి అధికారులు కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు.దీనితో కార్యాలయం పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.78 రోజులుగా విఆర్ఏలు సమ్మెబాట పట్టినప్పటినుంచి రెవెన్యూ పనులు మందకొడిగా సాగుతున్నాయని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో విఆర్ఏ మండల అధ్యక్షురాలు పెరుమళ్ళపిచ్చమ్మ,లక్ష్మి,మణి,రాధ,శోభ,ఝాన్సీ,చంద్ర కళ, సైదా,నాగు,అప్పయ్య,ఖాదర్, అంతయ్య,తదితరులు ఉన్నారు..