తాండూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బీ ఫారం.
తాండూరు అక్టోబర్ 16 (జనం సాక్షి)
తాండూరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలట్ రోహిత్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్
చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు. దీంతో తాండూర్ పట్టణ బిఆర్ఎస్ నేతలలో నూతన ఉత్సాహం నేలకోంది. ఆదివారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తన చేతుల మీదుగా బీఫామ్ అందజేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీ- ఫారం పొందడం పట్ల నేతలు
హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీ- ఫారం ఆడుకోవడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వెల్లడించారు




