తాడికొండ(జనం సాక్షి ): గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆగ్రహంతో వూగిపోయిన కొడుకు కన్నతల్లినే హత్య చేశాడు. మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చిన కిశోర్ తల్లితో చికెన్ కూర వండలేదని ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో తల్లి మరియమ్మ(60)పై కత్తితో దాడిచేసి హతమార్చాడు. కొంతకాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలు కూడా మరియమ్మ మృతి కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు కిశోర్ స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




