Thursday, 5 November 2026

తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ

తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ
 హైదరాబాద్: ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన వియ్యంకుడు ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తాతలయ్యారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి(బాలకృష్ణ కుమార్తె) శనివారం సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు.తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి డాక్టర్లు ఆండాళ్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రసవ సమయంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ ఆస్పత్రి వద్దే ఉన్నారు. సీఎం చంద్రబాబు ఉగాది ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లి తన మనవడిని చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *