Wednesday, 4 November 2026

తాత్కాలిక రోడ్డు సౌకర్యం కల్పించాలి

బజార్   ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద తక్షణమే తాత్కాలిక రోడ్డు వసతి ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్ అన్నారు ఆయన మాట్లాడుతూ బజార్ హత్నూర్ మండల కేంద్రం నుండి దాదాపు 25 కు పైగా గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారిపై బజార్ హత్నూర్ లో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో వరద ప్రవాహానికి మట్టి కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వివిధ గ్రామాలనుండి నిత్యం వందల మంది వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారని అదే విధంగా ఆదర్శ పాటశాల శిశుమందిర్ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాలలకు విద్యార్థులు ఈ మార్గం గుండానే రావాల్సి ఉన్నపటికీ రోడ్డు మార్గం సరిగా లేకపోవడం చిన్న వర్షానికే వరద ప్రవాహం పెరిగడంతో రోడ్డు దాటాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అధికారులు సదరు కాంట్రాక్టర్ తక్షణమే తాత్కాలిక రోడ్డు వసతి కల్పించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు