తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ.
రిశీలిస్తున్న ఎస్సై రాజశేఖర్.
నెన్నెల, అక్టోబర్12,(జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిందని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గంగిశెట్టి వేణు అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తన ఇంటికి తాళం వేసి తెలంగాణ గ్రామీణ బ్యాంకు సమీపంలో ఉన్న పాత ఇంటికి వెళ్ళడని, ఉదయం అయిదు గంటలకు కొత్త ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం, బీరువా తాళం పగులగొట్టి వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో బీరువాలో ఉన్న తులం బంగారం, 10 తులాల వెండి చోరీకి గురైందని, పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయం తో ఆదారాలు సేకరించామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.