సీఎం సహాయ నిధి,నిరుపేదలకు వరం
వైస్ ఎంపీపీ,టిఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి
జనం సాక్షి, చెన్నరావు పేట
సీఎం సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు వరం అని టిఆర్ఎస్ మండల కన్వీనర్ వైస్ ఎంపీపీ కంది కృష్ణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సహాయ నిధి నుండి వచ్చిన 48 వెల రూపాయల చెక్కును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రానికి చెందిన వరంగంటి శృతి అనారోగ్యంతో బాధపడుతున్న శృతి తండ్రి కుమారస్వామి కి చెక్కును టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్, వైస్ ఎంపీపీ కంది కృష్ణ రెడ్డి,సర్పంచ్ కుండే మల్లయ్య,జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డి ,గ్రామ పార్టీ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య,మహేందర్ రెడ్డి,వార్డు సభ్యులు శ్రీధర్ రెడ్డి ,రాంబాబు,బొంత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.