ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి : వైద్యాధికారి ఉషారాణి
జనం సాక్షి, చెన్నరావు పేట
ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పూర్తిగా మానేయాలని వైద్యాధికారి ఉషారాణి అన్నారు.క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ సేకరించి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని సబ్ సెంటర్లలో ప్లాస్టిక్ సేకరించి గ్రామ సచివాలయం సిబ్బందికి అందించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు రంనాయక్, హెల్త్ సూపర్వైజర్ ప్రేమలత, వైద్య సిబ్బంది శివాజీ, వెంకటరెడ్డి, అయా సెంటర్లలో వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.