తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా సీరోల్ మండలం ప్రథమ వార్షికోత్సవం.

తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా సీరోల్ మండలం ప్రథమ వార్షికోత్సవం

డోర్నకల్/సీరోల్, అక్టోబర్ 17, జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా
నూతన సీరోల్ మండల కేంద్రంగా ఏర్పడి మంగళవారం ప్రధమవార్షికోత్సవం శుభ సందర్భంగా తన కార్యాలయంలో తాసిల్దార్ నరేష్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.సీరోల్ మండల ప్రజలు మరోసారి హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ యాకుబ్ ,జూనియర్ అసిస్టెంట్స్ వెంకన్న,నారాయణ, రికార్డ్ అసిస్టెంట్స్ ఆలేటి బాలకృష్ణ,దీపక్, సరిత, ధరణి ఆపరేటర్ మధు తదితరులు పాల్గొన్నారు