Thursday, 5 November 2026

తిరుపతికి బయల్దేరిన మోత్కుపల్లి

హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తిరుపకి బయల్దేరి వెల్లారు. బుధవారం ఉదయం 9గంటలకు అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. కొండపైకి వెళ్లే ముందు అలిపిరి వద్ద ఆయన విూడియాతో మాట్లాడనున్నారు. అలాగే శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నాక.. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో ప్రెస్‌విూట్‌ నిర్వహించ నున్నారు. మోత్కుపల్లి తిరుపతి పర్యటన నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ఆసక్తి రేపుతోంది. మోత్కుపల్లిని టీడీపీ బహిష్కరించిన తర్వాత సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని ఓడించాలని శ్రీవారిని మొక్కుతానన్నారు. అలాగే ఏపీలో ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మోత్కుపల్లి మళ్లీ తిరుపతిలో ఎలాంటి సంచనాలకు తెర లేపుతారని ఉత్కంఠ రేపుతోంది. ఆయనకు వైకాపా మద్దతుగా నిలుస్తోంది.