Tuesday, 3 November 2026

తిరుమలలో అగ్ని ప్రమాదం కారణంగా అన్న ప్రసాదాల నిలిపివేత

తిరుమల : తిరుమలలోని అన్నదాన సత్రం గోదాంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోనికివెళ్లలేకపోతున్నారు. గోదాం వెనక ద్వారం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ఆక్టోపస్‌ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదానకి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని ప్రాథమిక అంచనాకు అధికారులు వచ్చారు. ఈ ప్రమాదం కారణంగా కొంతమేర వంటసామగ్రి, పదార్థాలు పాడయ్యాయి. ఈ మధ్యాహ్నం వరకు అన్న ప్రసాదాన్ని నిలిపివేసినట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *