తిలక్, ఆజాద్ లు స్పూర్తి ప్రదాత లు.

తొర్రూర్ 23 జూలై (జనంసాక్షి )
భారతీయ జనతాపార్టీ( బీజేపీ) తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు బాలాగంగాధర్ తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ గారల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ బ్రిటిష్ తెల్ల దొరల చేతిలో బందీ అయిన భరతమాత విముక్తి కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమర యోధులు బాలాగంగాధర్ తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ లు స్పూర్తి ప్రదాత లు అని కొనియాడారు. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు-దాన్ని సాధించి తీరుతాం అంటూ ఎలుగెత్తి చాటిన మహానీయుడు బాల గంగాధర తిలక్ అని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల పేరుతో ధేశం మొత్తం స్వాతంత్ర్య కాంక్ష ను రగిలించి ప్రజలలో దేశభక్తిని ప్రభోధం చేసి వారు స్వాతంత్ర్య సమరంలో ముందుండి పోరాడేలా ప్రేరణ కల్పించి న తొలి తరం సమర యోధుడు తిలక్ అని తెలిపారు.అతి చిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన యువ యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అని తెలిపారు.  బ్రిటిష్ వాళ్ళకు చిక్కకుండా వివిధ రకాల మారువేశాలతో దేశంలో అనేక ప్రాంతాల్లో తిరిగి యువతలో దేశభక్తిని పురిగొల్పి వారు ధేశమాత విముక్తి పోరాటం లో పాల్గొనే విధంగా అనేక ప్రణాళికలు రూపొందించిన మహనీయుడు ఆజాద్ అని తెలిపారు. స్వాతంత్ర్యం తన ఇంటి పేరుగా మార్చుకుని చంద్రశేఖర్ ఆజాద్ గా మారాడని ఎంతో మంది యువతీ యువకులకు స్పూర్తి ప్రదాత గా నిలిచాడని కొనియాడారు.తిలక్, ఆజాద్ ల స్పూర్తితో నేటి తరం యువత విద్యార్థులు దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, ఎస్సీ మోర్చ మహా బాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి రవిబాబు, ఎస్టీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపురం రాజకుమార్, ఎస్సీ మోర్చ అర్బన్ అధ్యక్షుడు మంగళపళ్ళి యాకయ్య, బీజేపీ తొర్రూరు అర్బన్ మండల నాయకులు నర్కుటి ఛలపతి రాజ్, వినయ్ కుమార్ శర్మ, గంధం రాజు,బీజేవైఎం అర్బన్ ప్రధాన కార్యదర్శి నూకల నవీన్,సి.హెచ్.శ్రీనివాస్,మచ్చ ఉదయ్ ,అమీర్ తదితరులు పాల్గొన్నారు.