ప్రజాసేవలో ముందుండే యువ నాయకుడు రవి
జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు సుశీల రెడ్డి
విద్యార్థులకు వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్లేట్స్ పంపిణీ
మేడిపల్లి – జనంసాక్షి
నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ప్రజల మనిషి పీర్జాదిగూడ నగర కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అందరికీ స్ఫూర్తి అని పీర్జాదిగూడ జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు సుశీల రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, సహాయం కోరినా వెంటనే స్పందించే వ్యక్తిత్వం ఉన్న ప్రజా సేవకులు రవి అని ప్రశంసించారు. కరోనా కష్టకాలంలో కూడా తనవంతు బాధ్యతగా విద్యార్థులకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యక్షేమాలు చూసుకున్నారని, ప్రతి సంవత్సరం వేసవి కాలంలో స్కూల్ పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ వారికి మంచి నీరు అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందిని తెలుసుకొని వారి అవసరం మేరకు ఈరోజు వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్లేట్స్ అందచేశారని, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ప్రధాన ఉపాధ్యాయురాలుతో కలిసి స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్స్ పార్టీ సీనియర్ నాయకులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఏనుగు జలేందర్ రెడ్డి, నారజు జంగా చారీ, అంజి రెడ్డి, మల్లేష్, కావడి మోహన్ కుమార్, కమిటీ నాయకులు గడ్డం రాంరెడ్డి, కంది రంజిత్ రెడ్డి, లోడే పవన్ కుమార్ గౌడ్, ఎర్ర ఐలేష్ యాదవ్, నాగరాజు యాదవ్, ఉపరి ఉదయ్ ముదిరాజ్, పంగా రాజు, శ్రీకాంత్ పటేల్, చిన్న, వంశీధర్ రెడ్డి, అఖిల్ గౌడ్, మహిళా కాంగ్రెస్స్ అధ్యక్షురాలు శ్రీలత భద్రు నాయక్, మహిళ నాయకురాలు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.




