Tuesday, 3 November 2026

హెచ్ఎండబ్ల్యుఎస్ డీజిఎంకు వీడ్కోలు

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈ నిర్మలకు స్వాగతం
మేడిపల్లి – జనంసాక్షి
హెచ్ఎండబ్ల్యుఎస్ డీజిఎం జి.కార్తీక్ రెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. డిజిఏం కార్తీక్ రెడ్డికి 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి శాలువ, పుష్పగుచ్ఛం అందజేసి వీడ్కోలు చెప్పారు. తదనంతరం కొత్తగా హెచ్ఎండబ్ల్యుఎస్ డీజిఎంగా బాధ్యత చేపట్టిన ఈ. నిర్మలకి శాలువ, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.