అల్వాల్ (జనంసాక్షి)
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ తుర్కపల్లి లోని శ్రీ దాం ఎంక్లేవ్ లో పర్యటించిన మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ముఖ్యంగా కాలనీలో డ్రైనేజీ మంచినీటి సరఫరా అంతర్గత రోడ్లు ఎలక్ట్రిసిటీ మొదలగు మౌలిక వసతులపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీకి మెరుగైన వసతులు కల్పించి వివిధ పనులకు దశలవారీగా అభివృద్ధి చేపడుతామని ఆయన తెలిపారు. అధికారులు డి ఈ మహేష్, ఏఈ రవళి, జలమండలి అధికారి సాంబయ్య, ఎలక్ట్రికల్ ఏడీ నాగరాజు, ఏఈ స్వాతి, ఆర్టికల్చర్ నవీన్, భాస్కర్, స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, ఢిల్లీ పరమేష్, కొండల్ రెడ్డి, శోభన్ బాబు, జస్వంత్ యాదవ్, రమేష్ యాదవ్, కాలనీ అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ యాదవ్, మరియాదాస్, నిరంజన్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు
Attachments area




