Wednesday, 4 November 2026

తెగిపడ్డ కరెంట్‌ తీగలు

దగ్ధమైన వాహనాలు

హైదరాబాద్‌,ఆగస్టు 8(జ‌నం సాక్షి): వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్‌ లోని కనకదుర్గ లారీ పార్కింగ్‌ యార్డులో ఉన్న కరెంట్‌ వైర్లు తెగిపడడంతో రెండు లారీలు, ఒక కారుదగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకుని ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. పార్కింగ్‌ యార్డులో కరెంట్‌ స్తంభాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.