తెగిపోయిన మట్టి రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రోడ్డుకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా ఆపార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి గ్రామం మీదుగా పడమటి కేశపూర్, లింగంపల్లి, నాగిరెడ్డిపల్లి, చుంచన కోట, జయల తదితర గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు తెగిపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాధమైన చంద్రయ్య, పోరెడ్డి నరసయ్య, గర్నపల్లి కనుకయ్య, సాదమైన రమేష్ పోరెడ్డి వెంకటేశం, గర్నపల్లి బాలమల్లు, జింకల బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.