తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక

*మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తెరస నేతలు,
*పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలే అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం,
*మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి,

ఖానాపురం సెప్టెంబర్ 20జనంసాక్షి
తెరాస పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు వార్డ్ నెంబర్లు మంగళవారం నర్సంపేటమాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి సమక్షంలో నియోజకవర్గం కన్వీనర్ తక్కలపెల్లి రవీందర్రావుఆధ్వర్యంలో అయోధ్య నగర్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ ముగ్గురు వార్డు సభ్యులు కొంత్తం రమ-రాజు పుప్పాల సరిత-దేవేందర్ దేశబోయిన గీత-మురళి, కిషోర్, తో పాటు10 కుటుంబాలకు దొంతి మాధవరెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తోటే లభిస్తాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లే తప్ప ఇప్పటివరకు తెరాస పార్టీ చేసింది ఏమి లేదు అన్నారు.మాటలకు తప్ప చేతలకు పనికిరారని ప్రభుత్వం ప్రజలను మోసం చేసే విధంగా చెప్పడమే తప్ప చేసింది ఏం లేదనిఅన్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో తెరస ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్ తక్కలపెల్లి రవీందర్రావు, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, ఖానాపురం మండల పార్టీ అధ్యక్షుడు వెంకట ప్రసాద్, జిల్లా కార్యదర్శి శాఖమూరి హరిబాబు,మైనార్టీ అధ్యక్షుడు ఎస్.కె ముస్తఫా, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్,సొసైటీ డైరెక్టర్ ఓడి అభ్యూతం, వార్డు సభ్యులు యాకయ్య,మాజీ ఎంపీటీసీ గుగులోతుజగన్,సారయ్య,రాజు,వర్థయ్య,రాజు,మలేషం,మురళి,వీరన్న,రాజేందర్,విజమ్,తదితరులు పాల్గొన్నారు.