హైదరాబాద్: విద్యుత్ కోతలకు నిరసనగా తెరాస ఎమ్మెల్యేల బృందం నేడు ట్రాన్స్‌కో సీఎండీని కలిసింది. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెరాస ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌కో సీఎండీ హామీ పత్రం ఇచ్చారు. తెలంగాణ ఫీడర్లకు వంద మెగావాట్ల అదనపు విద్యుత్ ఇస్తామని కూడా ట్రాక్స్‌కో సీఎండీ ఆ లేఖలో పేర్కొన్నారు.




