ఘనంగా మాధవరెడ్డి 13వ వర్ధంతి

భువనగిరి: దివంగత మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 13 వర్ధంతిని భువనగిరిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి భువనగిరిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఘాట్‌వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశయసాధనకు తెదేపా కార్యకర్తలు కృషి చేయాలిని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తెదేపా అన్ని స్థానాల్లో
గెలుపొందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ త్రిలేశ్వర్‌, సింగిల్‌ విండో ఛైర్మ్‌న్‌ సత్తిరెడ్డి,పట్టణ మండల పార్టీ కమిటీల అధ్యక్షులు నరసింహా, రమేష్‌ పాల్గొన్నారు.