తెరాస పార్టీ సభ్యత్వం భీమా అందించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే.యం. భూపాల్ రెడ్డి
పెద్ద శంకరంపేట్, జనం సాక్షి. సెప్టెంబర్14.
పెద్ద శంకరంపేట మండలంలోని గొట్టుముక్కల గ్రామానికి చెందినమాలిక్యమ్మ మరణించినందున వారి కుటుంబ సభ్యులకు తెరాస సభ్యత్వ భీమా ద్వారా 2 లక్షల రూపాయలు చెక్కును అందించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి. మండల పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం.జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్, మండల నాయకులు వేణుగోపాల్ గౌడ్ ,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, వీణ సుభాష్ గౌడ్, స్వప్న రాజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ఉదయ శ్రీ భాను ప్రకాష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు