Monday, 2 November 2026

తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): మాటలతో గారడీ చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఎమ్మెల్సీఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల భాజపా అభ్యర్ధి రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. భువనగిరిలో ఆయన శనివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతుందేగానీ హావిూలను నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైన డీఎస్సీ ఏర్పాటు చేయలేదని, ఉద్యోగులకు హెల్త్‌ కార్డులిచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు శ్యామ్‌సుందర్‌, పి.ఎస్‌.రవీందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్య, ఉపాధ్యాక్షురాలు మహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *