Wednesday, 4 November 2026

తెలంగాణపై ఎన్ని లేఖలు ఇవ్వాలి: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: తెలంగాణపై టీడీపీ వైఖరి మారనప్పుడు మరోసారి లేఖ ఇవ్వాల్సిస అవసరం ఏముందని ఆ పార్టీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు అన్నారు. అయినా తెలంగాణపై ఎన్ని లేఖలు ఇవ్వాలని, లేఖ ఇచ్చినా మళ్లీమళ్లీ అడగరని సమ్మరమేంటని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యకు మూలకారణం కాంగ్రెస్సే అని పేర్కొన్నారు. అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్‌ వైఖరి స్పష్టం చేయాలని కోరాలి అని పేర్కొన్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీ  సమావేశాలు నిర్వహిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *