హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఇచ్చి హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ ఆంశంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా చూసేందుకు పార్టీ కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రెండు రోజుల పాటు దీక్షలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు.




