ఖమ్మం నగరంలో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు, సత్తుపల్లి మండలం బుగ్గపాడులో మెగా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో అభివృద్ధిని పలు రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొంటుంటే రాష్ట్రంలోని కొన్ని పార్టీల నాయకులు పాదయాత్రలు, పల్లె నిద్రల పేరుతో జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పంచె కట్టగానే రైతు లు కారని, గడ్డాలు పెంచితే బాబాలు కాలేరని రాష్ట్ర మంత్రి కే తారక రామారావు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని.. ప్రతి ఒక్కరూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలనకు నీరాజనాలు పడుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించని కాంగ్రెస్ నాయకులు రోడ్డెక్కుతున్నారని మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. నెహ్రూ నుంచి మన్మోహన్‌దాకా దాకా దేశాన్ని పాలించింది ఆ పార్టీ నాయకులు కారా? అని ప్రశ్నించారు. 65 ఏండ్లలో జరగని అభివృద్ధి రెండున్నరేండ్లల్లోనే జరుగుతుందా? అని మండిపడ్డారు. గత ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారులో దహనమైన రూ.3 కోట్లు ఎక్కడివి అని మంత్రి ప్రశ్నించారు. పసిగుడ్డులాంటి తెలంగాణపై విషం జిమ్ముతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమన్నారు.
తెలంగాణపై విషం జిమ్ముతున్నారు




