హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన పంటను పరిశీలించేందుకు, రైతులను పరామర్శించేందుకు కేంద్ర బృందం నేడు రాష్ర్టానికి రానుంది. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ నేతలు 8 జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు మోహన్ భాయ్ కుందారియా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, మహబూబ్‌నగర్‌లో తెలంగాణ శాసనసభనేత డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, మెదక్‌లో ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఆదిలాబాద్‌లో రాజాసింగ్, రంగారెడ్డిలో ఎన్.రామచంద్రరావులు పర్యటించనున్నారు.




