హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్న తర్వాత సానియా తొలిసారి హైదరాబాద్ చేరుకున్నారు. నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు సానియా. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం తనలో ధైర్యం నింపిందని తెలిపారు.




