హైదరాబాద్,ఫిబ్రవరి20( జనంసాక్షి)
: తెలంగాణలో బిజెపి సమర్దమైన ప్రతిపక్షంగా ఉంటుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రంలో టిఆర్‌ఎస్ చేరుతుందని జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానమేనని ఆయన కొట్టిపారేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం అభివృద్ది పనుల కోసమే ప్రధాని మోడీని కలిశారని ఆయన చెప్పారు. సిద్దాంతపరంగా కూడా టిఆర్‌ఎస్ కు,బిజెపికి కొన్ని తేడాలు ఉన్నాయని ఆయన అన్నారు. వైరుధ్యాలు ఉన్నపార్టీలు కలసి పనిచేయలేవన్నారు. టీఆర్‌ఎస్ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. బీజేపీ, టీఆర్‌ఎస్ విధివిధానాలు పూర్తిగా వేరు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి బీజేపీ పనిచేస్తుంది. కేంద్రానికి అన్ని రాష్టాల్రు సమానమేనని, అవసరాల మేరకు అభివృద్ధికి చేయూత ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.కాగా బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధరరావు కూడా టిఆర్‌ఎస్ తో బిజెపి పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలు విూడియాలోనే చూస్తున్నానని వ్యాఖ్యానించారు. వీరంతా నిజంగానే ఈ మాటలు చెబుతున్నారా?లేక వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా అన్నది తెలియక ఇతర పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు.




