Thursday, 5 November 2026

బ్యాంక్‌ దగ్గర కాపుకాసి పట్టపగలే ఆరులక్షల చోరీ

విశాఖపట్టణం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
:  విశాఖ పట్నంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. నగరంలోని జగదాంబా సెంటర్‌ ప్రాంతంలో శుక్రవారం ఓ వ్యక్తి నుంచి రూ. 6 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నగరానికి చెందిన వి. కామేశ్వర్‌ అనే వ్యక్తికి హౌసింగ్‌ లోను నిమిత్తం రూ. 14 లక్షలు మంజూరయ్యాయి. కాగా అందులో రూ. 6 లక్షలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు డబ్బు ఉన్న బ్యాగ్‌ ను అపహరించి పరారయ్యారు.బీహార్‌ కు చెందిన దొంగల ముఠా దోపిడీ కి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన నుంచి తేరుకున్న కామేశ్వర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  కేసు నమొదు చేసిన పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తూ, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డబ్బులు డ్రా చేసేప్పుడు జాగ్రతత్గా ఉండాలని, ఒంటరిగా వెళ్లవద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు గమనించడం లేదని పోలీసులు అన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతన్నా ఎందుకు చైతన్యం కారో అర్థం కావడం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *