Monday, 2 November 2026

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కృషి చేయాలి :బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్

  ఎల్బీ నగర్ (జనం సాక్షి )   తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కృషి చేయాలని  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అయినా  బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు .   బిజెపి రాష్ట్ర కార్యాలయంలోబిజెపి రాష్ట్ర నేత , మాహేశ్వరంఅసెంబ్లీ కొలన్ శంకర్ రెడ్డి   నాయకత్వంలో  బిజెపి పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ దేశ చరిత్రలో గిరిజన తెగకు చెందిన మహిళను దేశ అత్యున్నత మైన పదవి రాష్ట్ర పతి గా  ద్రౌపది మూర్మ్   ని ఎంపిక చేసినందుకు గాను ప్రధాని కి మీ ద్వారా కృతజ్ఞతలు  ,  మీరు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 3 వ విడత  జయప్రదం కావాలని బిజేపీ గెలుపుకు నాందిగా ఉండాలని కోరుతూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అయినా  బండి సంజయ్ కుమార్ కి స్వీట్ తినిపించి శాలువాతో సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ సాధారణ నుండి అతి సాధారణ కార్యకర్తలు అత్యున్నతమైన పదవులు పొందే అవకాశం కేవలం బిజెపి లోనే సాధ్యమని అందుకు నిదర్శనమే రాష్ట్రపతిగా ద్రౌపది మూర్మ్  ఎంపిక అలాగే  నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన ఘనత బీజేపీపి లోనే సాధ్యమని అన్నారు అందుకు ప్రతి కార్యకర్త నిరంతరం ప్రజా జీవితంలో ఉండి తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి శీలం పల్లి రాజశేఖర్ విక్కీ భాను ప్రకాష్ గాజుల మధు దేవర శ్రీనివాస్ ఆనంద్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు