హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నేటితో ముగిశాయి. ఈరోజు జరిగిన సాంఘికశాస్త్రం-2 పేపరుతో పరీక్షలు ముగిశాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు స్వల్ప సంఖ్యలో మాత్రమే విద్యార్థులు హాజరవుతారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమై… కొనసాగుతోంది. మే నెల మూడోవారంలో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది 5లక్షల 56వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా… సుమారు 90శాతం మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.