Wednesday, 4 November 2026

తెలంగాణ ఆకాంక్షలను నీరుగార్చారు

అందుకే మరోమారు ఉద్యమిస్తున్నాం: దిలీప్‌
హైదరాబాద్‌,మే5(జ‌నం సాక్షి ): చలి చీమలు పెట్టిన పుట్టలో విష సర్పాలు చేరినట్లుగానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడగానే దానితో సంబంధం లేనివారంతా అదికరాంలో చేరారని తెలంగాణ జనసమితి కన్వీనర్‌ దిలీప్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్లనే ప్రొఓఫెస్‌ కోదండరామ్‌ ఆధ్వర్యంలో మారోమారు తెలంగాణ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. కేవలం ఒక కుటుంబం చేతిలో అదికారం బందీ అయ్యిందని, ప్రజలను నిరంకుశంగా వేదిస్తున్నారని ఆయన శనివారం నాడిక్కడ మండిపడ్డారు.
రైతు ఆత్మహత్యలు, అరణ్య రోదనలు లేని తెలంగాణ ఏర్పాటే తెలంగాణ జనసమితి ప్రధాన లక్ష్యమని అన్నారు. 1954 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు ఉద్యమంలో పాలుపంచుకొని పోరాటాలు చేసిన వారు ఎక్కడున్నారన్నారు. ప్రస్తుత మంత్రులుగా,ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా ఉన్న వారిలో చాలామందికి  తెలంగాణ పోరాటంతో సబంధం లేదన్నారు. తెలంగాణ రాదంటూ ఉద్యమాన్ని  ఉద్యమాన్ని నీరుగార్చిన ఎంతోమంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పాలనలో భాగస్వామ్యులు అయ్యారన్నారు. ప్రస్తుతం
రాష్ట్రంలో కుటుంబ పాలన, దొరల పాలన అమలవుతోందని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ కనీసం రాష్ట్ర సచివాలయంకు రాని పాలన కొనసాగుతోందన్నారు. ఉద్యమంలో మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన నియామకాలు మనకు అన్న ఉద్యమ నినాదం ప్రజలందరినీ ముందుకు నడిపించిందన్నారు. అవేవిూ నెరవేరనందునే.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే ఈ రోజు కోదండరామ్‌ మరోమారు ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు.  నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మాత్రమే పార్టీ నడుస్తుందన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తెజస పక్షాన అభ్యర్థులు బరిలో నిలుస్తారన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారని అన్నారు. నిజమైన తెలంగాణ తెలంగాణ జనసమితితో మాత్రమే సాధ్యమని అన్నారు.
—-