హైదరాబాద్: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. 91.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలురు పైచేయి సాధించారు. జూన్ 29న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జులై 4 నుంచి 6 వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరుగనుంది. జులై 6 నుంచి 8 వరకు ఆప్షన్స్ ఎంపిక జరుగనుంది. కంప్యూటర్ సైన్స్ లో మొదటిర్యాంకు కామేశ్వరరావు(171/200), సివిల్ ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంకు ఎం.రాజశేఖర్(160/200), ఎలక్ట్రానిక్స్ లో మొదటిర్యాంకు పవన్ కళ్యాణ్ (163/200), మెకానికల్ లో మొదటిర్యాంకు సాయికుమార్(155/200), ట్రిపుల్ ఈలో మొదటి ర్యాంకు ఎం.శంకర్(170/200) సాధించారు.




