Thursday, 5 November 2026

తెలంగాణ ఐసెట్‌, ఎడ్‌ సెట్‌ ఫలితాలు విడుదల

15రోజుల్లో ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ
వెల్లడించిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి
హైదరాబాద్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : తెలంగాణ ఐసెట్‌, ఎడ్‌ సెట్‌ 2018 ఫలితాలు  బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 15 రోజుల్లో ఐసెట్‌ కౌన్సెలింగ్‌ పక్రియ ప్రారంభం కానున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం గత నెల 23, 24 తేదీల్లో టీఎస్‌ ఐసెట్‌ 2018 పరీక్షలు నిర్వహించారు. ఐసెట్‌ రాసిన 55,199 మందిలో 49,812 మంది ఉత్తీర్ణత సాధించారు. 90.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి ర్యాంకును హైదరాబాద్‌ కు చెందిన తాటి సత్య ఆదిత్య సాధించాడు. 200 మార్కులకు గాను ఆయనకు 164 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకును హైదరాబాద్‌ కు చెందిన ఎల్చూరి సాయిసందీప్‌ సాధించాడు. ఆయనకు 163 మార్కులు వచ్చాయి. మూడో ర్యాంక్‌ ను హైదరాబాద్‌ కు చెందిన గాదె నవీన్‌ కుమార్‌ సాధించాడు. ఆయనకు 162 మార్కులు వచ్చాయి. ఇక.. రాస్టం/ారలోని బీఏడ్‌ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం మే 31న ఆన్‌ లైన్‌ ద్వారా ఎడ్‌ సెట్‌ ా 2018 జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 32,330 మంది విద్యార్థులు హాజరయ్యారు.