*తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ*
కోదాడ సెప్టెంబర్ 27(జనం సాక్షి)
తెలంగాణ గర్వించే గొప్పనేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాని పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ…… ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఆయన చేసిన కృషిని, నిస్వార్థ సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం కృషి చేశారన్నారు.తెలంగాణ కోసం పోరాటం చేసిన బాపూజీ స్ఫూర్తి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వివరించారు. సబ్బం డ వర్ణాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కొండా సైదయ్య, పట్టణ కౌన్సిలర్లు వంటిపులి శ్రీనివాస్, కట్టెపోయిన శ్రీనివాస్ యాదవ్ , కాజా, సాదిక్, గుండెల సూర్యనారాయణ, చింతల్ నాగేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ రహీం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆలేటి సత్యనారాయణ, చెవుల నాగేశ్వరరావు, ఎంపిటిసి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు సంగిశెట్టి గోపాల్, జానకి రామాచారి, తాళ్లూరి శ్రీనివాస్, భాష్యం సైదులు యాదవ్, బత్తుల ఉపేందర్, మాతంగి మట్టయ్య, వంశీ, తదితరులు పాల్గొన్నారు.
Attachments area