Tuesday, 3 November 2026

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కు ప్రత్యేక స్థానం…. గొట్టిముక్కల వెంగల్ రావు…

కూకట్ పల్లి జనంసాక్షి :తెలంగాణ వియోచన దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని దాయార్ గుడాలో కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి,డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్,జనరల్ సెక్రటరీ గోవింద్ గౌడ్, మేకల నర్సింగ్ రావు, సింగురి పాండు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి, అనిల్ కుమార్, గణేష్, నాగార్జున, నరేందర్, గురు మూర్తి, కరీం, దీపక్, యాదగిరి, నర్సింగ్, భారత్, మురళీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.