తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ను విజయవంతం చేయాలి
కరీంనగర్ తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు జీ.వి రామకృష్ణారావు
మానకొండూరు, ఆర్ సి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి )
సెప్టెంబరు 16, 17, 18 వ తేదీలలో మూడు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, అధికారికంగా నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ను విజయవంతం చేయాలని తెరాస పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీ వి రామకృష్ణా రావు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ,అధికారులు, అభిమానులు, కార్యకర్తలు, తదితరులు అందరూ విధిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు .నేడు (శుక్రవారం) మానకొండూరు లోని చెరువు కట్ట వద్ద నుండి ఇందిరా క్రాంతి పధం సెంటర్ వరకు 15వేల మందితో ర్యాలీగా సభావేదికు తరలి వెళ్తామన్నారు. గురువారం సమైక్యతా వజ్రోత్సవ ఉత్సవాలను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 17న జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ, 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు. ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. మంచినీరు, భోజన, రవాణా సదుపాయాలు కల్పించా మన్నరు. తెరాస శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు తదితరులు విధిగా సమావేశానికి హాజరై, వజ్రోత్సవాల విజయవంతానికి తనవంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు. జిల్లా ప్రాదేశిక సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూరు సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గోపు రవీందర్ రెడ్డి, నాయకులు శాత రాజు యాదగిరి ,ఎరుకల శ్రీనివాస్ గౌడ్, పిట్టల మధు, ఉండండి శ్యాంసన్, నెల్లి శంకర్, గుర్రం కిరణ్ గౌడ్, కిషన్ , పిండి సందీప్ తదితరులు పాత్రికేయుల సమావేశానికి హాజరయ్యారు.