Wednesday, 4 November 2026

*తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రైతు. దినోత్సవం దినోత్సవాన్ని రైతు వేదికలలో ఘనంగా నిర్వహించాలి

గద్వాల నడిగడ్డ,జూన్ 1 (జనం సాక్షి); తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రైతు దినోత్సవాన్ని రైతు వేదికలలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో, అధికారులకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ సమావేశం హాలు నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని మండలాల అధికారులతో దషాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవాల గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల మూడవ తేదీన రైతు వేదికల దగ్గర రైతు దినోత్సవం జరగనున్నందున రైతు వేదికలను శుభ్రంగా ఉంచి లైటింగ్ ఏర్పాటు చేయాలని, రైతు వేదిక ఆవరణ దశాబ్ది ఉత్సవాల లోగో ముగ్గు వేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి గ్రామం నుండి రైతులకు ముందస్తుగా సమాచారం చేరవేయాలని ఇందుకు తగిన కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. రైతులు ఎద్దుల బళ్ళు, ట్రాక్టర్ల పై ర్యాలీతో రైతు వేదికలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదికలో ఉత్సవ సభలో రైతులకు గత తొమ్మిది సంవత్సరాల వ్యవసాయ శాఖ సాధించిన ప్రగతిని వివరించాలన్నారు. అలాగే రైతు బీమా, రైతు బంధు, 24 గంటల విద్యుత్తు తదితర పథకాలపై రైతులతో మాట్లాడించాలన్నారు. ఉత్తమ రైతులకు సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు నిర్వహించుకోవాలని తెలిపారు. రైతు వేదికల ఏర్పాట్లను ఒకరోజు ముందుగానే అన్ని సరిచూసుకోవాలని తోరణాలు, అలంకరణలు, లైటింగ్ ఉండాలన్నారు. రైతులు వరి బదులు ఆరు తడి పంటలైన కంది, ప్రత్తి, ఆయిల్ ఫామ్ లాంటి పంటలు సాగు చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. వెయ్యి మంది రైతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వారికి నాణ్యమైన భోజన వసతి కల్పించాలన్నారు. ఈ రోజే అన్ని గ్రామాలలోని రైతు వేదికలను పర్యవేక్షించి 3వ తేదీ న జరిగే రైతు దినోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించార. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, డి ఏ ఓ గోవింద నాయక్, ఇరిగేషన్ రహీముద్దీన్, శ్రీనివాసులు, కార్యాలయ అధికారి మదన్ మోహన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.