Tuesday, 3 November 2026

తెలంగాణ పంచాయితీల్లో నూతన శకం

ఏకకాలంలో 4,383 కొత్త పంచాయతీలు ప్రారంభం

నాగర్‌ కర్నూలు జిల్లాలో పాల్గొన్న మంత్రి జూపల్లి

అనేక గ్రామాల్లో మంత్రులు,ఎమ్మెల్యేల చేతుల విూదుగా ఏర్పాటు

హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): తెలంగాణ పంచాయితీల్లో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 4,383 కొత్త పంచాయతీలు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. ఇంత కాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు ప్లలెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర ¬దా దక్కగా అవి పంచాయితీలుగా ప్రారంభం అయ్యాయి. ఇక గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో తెలంగాణ ప్లలెసీమల ముఖచిత్రం సమూలంగా మారి పోనున్నది. కొత్త ప్లలెలకు ఇదొక పండగరోజన్న మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌ కర్నూలు జి/-లలాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త పంచాయితీలను పలవుఉరు మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రారంభించి, అభివృద్దిలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రలుఉ హరీష్‌ రావు మోదక్‌ జి/-లలాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి పర్యటించి,తాండూరు రూరల్‌ మండలం చింతామణి పట్నంలో జాతిపిత గాంధీ విగ్రహానికి నివాళులు వేసి,కొత్త పంచాయితీ ని ప్రారంభించారు. పాలనా సౌలభ్యం, అభివృద్ధి ఫలాలు ప్రజల దరిచేర్చేందుకు సీఎం కేసీఆర్‌ అంబేద్కర్‌ స్పూర్తి తో చిన్న జిల్లాలు, కొత్త మండలాలు,పంచాయితీలు ఏర్పాటు చేశారని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. అలాగే తాండూరు ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖీగా సమస్యలు తెలుసుకున్న మంత్రి, ప్రభుత్వ విద్యావిధానం పటిష్టం చేస్తున్నట్లు ప్రకటించారు. .కళాశాలకు ఇప్పటికే కోటి నిధులు అందించినం ఫర్నీచర్‌ కోసం మరో రూ. 20 లక్షలు తక్షణం మంజూరు చేస్తామని అన్నారు. ఇకపోతే యాదాద్రి భువనగిరిజిల్లా భూదాన్‌ పోచంపల్లి మండల కేంద్రంలో నుతనంగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘం నూతన కార్యాలయం,నూతన గ్రామ పంచాయతీని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. మమహబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెధ్దవంగర మండలంలో నూతనంగా ఏర్పడ్డ పది గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవంలో భాగంగా.. ఎల్‌.బి.తండా, బి.సి.తండాల్లో గ్రామ పంచాయతి భవనాలను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రారంబించారు. ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన గిరిజన తండా వాసుల ఆనందం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడ్డ బావోజిగూడెం గ్రామ పంచియతీని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ రావుతో కలసి ప్రాంభించారు. తండాలను పంచాయితీలు చేస్తామన్న మాట ఇచ్చి ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాట నిలుపుకున్నారని ఎర్రబెల్లి అన్నారు. తండాల అభివృద్దికే నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగిందన్నారు. తండాలను అన్ని విధాలుగా అభివృద్ది చేయాలన్న తపన సియం

కేసిఆర్‌దన్నారు. సంగారెడ్డి జిల్లా..పఠాన్‌ చేరు నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఆవిర్భవించిన గ్రామ పంచాయతీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ప్‌ఆరరంబించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపల్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పఠాన్‌ చేరు నియోజకవర్గ పరిధిలో 3 మండలాలను 5 మండలలుగా,13 నూతన గ్రామ పంచాయితీ లు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు,వార్డ్‌ సభ్యులు,గ్రాసస్తులు

తతితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వ్యాప్తంగా ఏడు గ్రామాలు నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మండలంలోని గిరాయిపల్లి, దమ్మక్క పల్లి , రాంపల్లి , దర్గా , విశ్వనాధపల్లి రవీంద్రనగర్‌, బోబ్బాయి పల్లి, ముద్దాపూర్‌, గ్రామాలు నూతన గ్రామపంచాయతీలుగా ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి నందుకు సీఎం కెసిఆర్‌కు నూతన గ్రామ పంచాయతీల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.