వ్యక్తిపై పోలీసుల ముందే దాడి
హైదరాబాద్,ఆగస్ట్1(జనం సాక్షి): హైదరాబాద్ నగర శివారు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ మహిళ హల్‌చల్ సృష్టించింది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన వద్ద అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే శ్రీనివాస్ బుధవారం రాత్రి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్లో ఉన్నాడని తెలుసుకున్న సదరు మహిళ అక్కడికి చేరుకుని అతడిపై దాడి చేసింది. అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టి హంగామా సృష్టించింది. పోలీసులు ఆమెను వారించి పంపించారు. అయితే శ్రీనివాస్‌తో ఆమె సహజీవనం చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




