Tuesday, 3 November 2026

*తెలంగాణ పితామహుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్.*

ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి – ఎంపీపీ చింతా కవిత
కోదాడ. ఆగస్టు6(జనం సాక్షి)
 తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు వేసి తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఘనుడు, మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రెడ్డి మాట్లాడుతూ జీవితమంతా తెలంగాణ కోసమే బ్రతికి తెలంగాణ కోసమే కలలు కంటూ తెలంగాణ సాధనకై అహర్నిశలు కృషి చేసి తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసి నిధులు విధులు నియామకాల్లో తెలంగాణకు,తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను తన మేధో శక్తితో తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి తెలంగాణ జాతిని జాగృతపరచిన మేధావి కొత్తపల్లి జయశంకర్ సార్ అని, కానీ ఆయన కలలు కన్న తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారం అయ్యే నాటికి ఆ మహానుభావుడు లేకపోవడం విచారకరమని అయినప్పటికీ యువత ఆ మహానుభావుడు కలలు కన్న ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ ఎంపీ ఓ పాండు  రంగన్న,ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు,పంచాయతీరాజ్ ఏఈ రాము,సీనియర్ అసిస్టెంట్ వెంకన్న,మండల కో ఆర్డినేటర్ సైదులు, కార్యాలయ సిబ్బంది రవి నాయక్,అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.