Thursday, 5 November 2026

తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ కె మీరా, ప్రధాన కార్యదర్శి గా దేశోజు మధు లు ఏకగ్రీవంగా ఎన్నిక

గరిడేపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు బుధవారం జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ మహాసభలో జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులుగా ఎస్ కే మీరా, దేశోజు మధు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ మహాసభలో ఎన్నుకున్న సభ్యులతో  ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ప్రమాణ స్వీకారం చేయించారు.నవంబర్ 20 న తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలను సూర్యాపేటలో నిర్వహిస్తామని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలో జిల్లా ఉపాధ్యక్షులుగా కామల్ల శ్రీను, నాగేల్లి రామ నర్సయ్య, బాబు జానీ, సహాయ కార్యదర్శులుగా దుర్గాప్రసాద్, కంచణపల్లి  సైదులు, గండు స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల సైదులు సభ్యులుగా ప్రతాప్, గడ్డ ఉపేందర్, గాడుదల  కళింగం, రామకృష్ణ, కట్ల వీరన్న, నరసింహారావు, ఎస్కే పాష, నక్క ఎల్లయ్య, మాదాసు యాదగిరి, సూరారపు వెంకన్న, గుండ గాని రవి, తండు సురేష్, ఎస్ కే మౌలానా, నన్నే బాబా, పోకబత్తిని వీరబాబు, ఏడుకొండలు, మరికంటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.