సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామచందర్
టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): ఈనెల 14న విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ 24వ మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామచందర్ కోరారు. గురువారం మండల కేంద్రంలో సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలోసమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామ్ చందర్ మాట్లాడుతూ శుక్రవారం జరుగు సిపిఐ జాతీయ 24వ మహాసభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో భారీ ఎత్తున మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ జరగనున్నందున సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, పార్టీ కార్యకర్తలు, మహిళ, విద్యార్థి,యువజన,రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని దానిని తిప్పిగొట్టే కార్యచరణ ఈ జాతీయ మహాసభలో తీర్మానించి రాబోయే రోజుల్లో సిపిఐ పార్టీ ఏఐటియుసి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ మండల నాయకులు ఎజ్జు భాస్కర్, గుగులోతు శ్రీను,వాసం భద్రయ్య, అయిత శ్రీరాములు, బానోత్ వీరన్న, బండి వీరభద్రం, సుందర్ పాల్, లక్ష్మణ్,మధు,సతీష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.




