తెలంగాణ ప్రభుత్వంతోనే ఆడపడుచులకు ఆత్మగౌరవం
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి
ఏ పనిలోనైనా పీర్జాదిగూడ పర్ఫెక్ట్ అని కితాబు
మేడిపల్లి – జనంసాక్షి
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆడపడుచులకు ఆత్మగౌరవం పెరిగిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. సిఎం కేసీఆర్ దయగల మనిషి అని, ఆయన చల్లగా ఉండాలని అందరం కోరుకుందామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పీర్జాదిగూడ కార్పొరేషన్ లో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా ఏ పండుగ వచ్చినా సీఎం కేసీఆర్ సహాయసహకారాలు అందిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నివర్గాల ప్రజలకు పెన్షన్ అందిస్తున్నారని చెప్పారు. బీడీ కార్మికులకు 2016 రూపాయలు అందించి వారికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను మంత్రి మల్లారెడ్డి అభినందించారు. ఏ పనిలోనైనా ఇక్కడ శాస్త్రీయబద్ద పనులు చేపడుతున్నారని, డైనమిక్ లీడర్ జక్క వెంకట్ రెడ్డి, ఇతర కార్పొరేటర్ల సహకారం కూడా అందుకు కారణమని మంత్రి కొనియాడారు. గత రెండున్నరేళ్ల నుంచి కొనసాగుతున్న ఈ పనితీరు.. భవిష్యత్ లోనూ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్ బి శారద, బి స్వాతి, ఏం చంద్రకళ, బండి రమ్య, హరి శంకర్ రెడ్డి, భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, బండారి మంజుల, కుర్ర శాలిని, తూముకుంట్ల ప్రసన్నలక్ష్మి శ్రీధర్ రెడ్డి, అమర్ సింగ్, కో ఆప్షన్ నెంబర్లు, ల తో పాటు , నాయకులు ,పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
Attachments area