Wednesday, 4 November 2026

తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ హైర్ వెహికల్

 అసోసియేషన్ 2023 క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
గద్వాల నడిగడ్డ జనవరి 23 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చేతులమీదుగా 2023 నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు.ముఖ్య అతిధిగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా కూడ క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా కొన్ని విషయాలు ఆమె దృష్టికి తీసుకువచ్చినట్లు గద్వాల జిల్లా పోర్ విల్లర్ హైర్ వెకిల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు తెలియజేశారు.జిల్లా, మండల శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వధికారులు తమ ఓన్ ప్లేట్ వాహనాలను పెట్టుకొని బినామీ వాహనాదారులపై బిల్లులు కాజేస్తూ ప్రభుత్వ ఆదాయనికి గండి కొడుతు నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేసే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయాలని జిల్లా హైర్ వెకిల్స్ సభ్యులు కోరడమైనది. ఈ కార్యక్రమంలో చాంద్ పాషా, మహేష్,జిందు, గాంధీ నరేష్, నరేష్, వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.