హైదరాబాద్: రేపు ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ప్రాంత మంత్రులు తెలంగాణ వచ్చే వరకు హైదరాబాద్‌కు తిరిగి రావొద్దని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ వ్యక్తం చేశారు. అభివృద్థి నిధుల్లోనూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింధని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సరియైన డాటా సేకరించానని త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కలిసి వివరిస్తానని ఆయన వెల్లడించారు. కాగా, ఇవాళ సాయంత్రం మంత్రి జానారెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.రేపు ఉదయం మరో నలుగురు తెలంగాణ మంత్రులు కూడా హస్తినకు బయలుదేరి వెళ్తారు.




