తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్

హుజూర్ నగర్ ఫిబ్రవరి 18 (జనంసాక్షి): మండలంలోని బూరుగడ్డ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం బూరుగడ్డ గ్రామంలో గ్రామ సర్పంచ్ షేక్ సలీమా రంజాన్, గ్రామ శాఖ బిఆర్ఎస్ అధ్యక్షులు గండు సైదులు ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శీలం ఆదెమ్మ, సీనియర్ నాయకులు గువ్వల అయోధ్య, ఎరగాని రామస్వామి, షేక్ అలీ, డ్రైవర్ రాములు, గువ్వల వీరయ్య, కాసాని గోపాలం, ఎరగాని వెంకన్న, బుద్ధిమట్టయ్య, ఆవుల వెంకటయ్య, గండు చిన్న సైదులు, ప్రార్థన పోయిన మల్లయ్య, గూడెపు బ్రహ్మ, తుమ్మలమట్టపెల్లి, సురభి కుషేల్, పొదిల సైదులు, బత్తిని నాగరాజు, కాంపాటి అశో,క్ ఒట్టేపు మధు, కాంపాటి శ్రీను, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.